నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్.. 287 మందితో తుది జాబితా?
- ట్రంప్ పేరును సూచన ప్రాయంగా వెల్లడించిన నోబెల్ కమిటీ సెక్రటరీ
- తుది జాబితాలో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయన్న క్రిస్టియన్ బెర్గ్ హార్ప్వికెన్
- ట్రంప్‌ను నామినేట్ చేసిన కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్థాన్
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి-2026 కోసం నామినేషన్ల పర్వం ఆసక్తి రేపుతోంది. ఈ ఏడాది పురస్కారం కోసం మొత్తం 287 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అయినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ సెక్రటరీ క్రిస్టియన్ బెర్గ్ హార్ప్వికెన్ గురువారం వెల్లడించారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉండే అవకాశం ఉందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.
ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు స్వీకరించిన హార్ప్వికెన్ మాట్లాడుతూ తుది జాబితాలో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. "ప్రతి ఏటా నామినేషన్ల జాబితాలో ఎంతో మార్పు ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది" అని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఘర్షణలు, అంతర్జాతీయ సహకారంపై ఒత్తిడి ఉన్నప్పటికీ, నోబెల్ శాంతి బహుమతి ప్రాముఖ్యత మరింత పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. "మనం జీవిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి బహుమతి పాత్ర ఎంతో కీలకం. గతంలో కంటే ఇప్పుడు మరింత మంచి పనులు జరుగుతున్నాయి" అని ఆయన వివరించారు.
డొనాల్డ్ ట్రంప్ పేరు నామినేషన్లలో ఉండే అవకాశం ఉందని హార్ప్వికెన్ చెప్పినప్పటికీ, ఆయన పేరును అధికారికంగా ధ్రువీకరించలేదు. నిబంధనల ప్రకారం నామినేషన్ల జాబితాను 50 ఏళ్ల పాటు అత్యంత రహస్యంగా ఉంచుతారు. అయితే, కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్థాన్ దేశాధినేతలు ట్రంప్‌ను ఈ ఏడాది బహుమతికి నామినేట్ చేసినట్లు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని ‘రాయిటర్స్’ గుర్తుచేసింది. అయితే, కేవలం నామినేషన్ వచ్చినంత మాత్రాన అది నోబెల్ కమిటీ ఆమోదంగా భావించరాదని హార్ప్వికెన్ స్పష్టం చేశారు.
నోబెల్ కమిటీ సభ్యులే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి నామినేషన్లు ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ సభ్యులు, దేశాధినేతలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మాజీ నోబెల్ గ్రహీతలు కూడా పేర్లను సూచించవచ్చు. రష్యా ప్రతిపక్ష నేత యూలియా నావల్నాయా, పోప్ లియో, సుడాన్ స్వచ్ఛంద సంస్థ 'ఎమర్జెన్సీ రెస్పాన్స్ రూమ్స్' వంటి పేర్లు కూడా బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లలో చర్చనీయాంశంగా ఉన్నాయి.
2026 నోబెల్ శాంతి బహుమతి విజేతను అక్టోబర్ 9న ప్రకటించి, డిసెంబర్ 10న అవార్డును ప్రదానం చేస్తారు. కాగా, వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేసిన ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు గత ఏడాది (2025) నోబెల్ శాంతి పురస్కారం లభించిన విషయం తెలిసిందే.